లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకి చెందిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్.రాజ మల్లయ్య, హైదరాబాద్ రాంనగర్ కు చెందిన సుదర్శన్ అనే వ్యక్తి నుంచి 50 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అరెస్ట్ చేసిన ఏసీబీకి అధికారులు, లంచం తీసుకున్నట్టు ఏసీబీ విచారణలో తేలింది.
కీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో ఓ స్థలం విషయంలో కమిషనర్ రాజ మల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్‌లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా మున్సిపల్ కమిషనర్ లంచం డిమాండ్ చేశాడు.
రూ.50 వేలు ఇచ్చేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. గత 15 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్‌కు సుదర్శన్ 20 వేల రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు సుదర్శన్ నుంచి మున్సిపల్ కార్యాలయంలో 30 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రాజమల్లయ్య నుంచి లంచం సొమ్మును రికవరీ చేసి రసాయన పరీక్ష నిర్వహించగా లంచం తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.