సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
సైబర్ క్రైమ్ మోసాల పట్ల జాగ్రత్త వశించాలి- హుస్నాబాద్ సిఐ కె. శ్రీనివాస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థుల అవగాహన కలిగి ఉండి తమ తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు వివరించాలని హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ అన్నారు. సోమవారం అక్కన్నపేట మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థులకు మహిళల భద్రత రక్షణ, సైబర్ క్రెం, ఆన్‌లైన్ మోసాలు అంశాలపై హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ..మహిళలు, విద్యార్థినిలకు రక్షణ కోసమే షీ టీం ఏర్పాటు చేశామని అన్నారు. సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాలపై, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థినిలకు సూచించారు. షీటీమ్స్ బృందాలు, మహిళల భద్రత రక్షణ, డయల్ 100, సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాలు, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో కస్తూర్బాగాంధీ పాఠశాల ఎస్ఓ సరిత, ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది రమేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.