మంత్రి మెప్పు కోసం సతీష్ కుమార్ పై విమర్శలు
మాజీ ఎమ్మెల్యే పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు మానుకోవాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
హామీలు నేరవేర్చేవరకు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది
హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశం లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకుంటూ ప్రజల పక్షాన నిలబడి కొట్లడే బిఆర్ఎస్ నాయకులు మాజీ శాసన సభ్యులు సతీష్ కుమార్ పై అనవసర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుా, ప్రజల దృష్టి మళ్ళీంచేందుకు తపన పడుతున్నారు తప్ప నియోజకవర్గ ప్రజలకు పదకొండు నెలలో చేసింది ఏమి లేదని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం లో గత ప్రభుత్వం లో అయినా అభివృద్ధి పనులు తప్ప ఏమన్నా కొత్తగా అభివృద్ధి పనులు జరిగాయా అని ప్రశ్నించారు. కనీసం సతీష్ కుమార్ తన పదవి కాలం లో తీసుకువచ్చిన పనులు పూర్తయినా కూడా వాటిని ప్రారంభించే పరిస్థితి లేదన్నారు. గత పది సంవత్సరాల లో పది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనపడటం లేదా అని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పుకోసం కొంత మంది కాంగ్రెస్ నాయకులు సతీష్ కుమార్ ని ఇష్టం వచ్చిన రీతిలో విమర్శలు చేస్తుా కాలం గడుపుతున్నారని, సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం నుండి పదివేల కోట్ల రూపాయలు తీసుకవచ్చి హుస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని, ఇప్పుడు అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి సతీష్ కుమార్ తెచ్చిన నిధుల కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకువచ్చిన మిమ్మల్ని అభినందిస్తామని సవాల్ చేశారు. కానీ అనవసరపు విమర్శల తో కాలం గడిపితే ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అవసరం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అధికారం ఉంది కదా అని సతీష్ కుమార్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. ఈ సమావేశం లో బి ఆర్ యస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత, బి ఆర్ ఎస్ పార్టీ నియోజవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్ రెడ్డి, నాయకులు సూరం పల్లి పర్శరాములు, ఎడబోయిన తిరుపతి రెడ్డి, ఆయిలేని శంకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ బొజ్జ హరీష్, అనుమల్ల ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి, నమిలికొండ రాజయ్య, బత్తుల జీవన్, కందుకూరి సతీష్, జెరిపోతుల సునీత, భూక్యా రాజు నాయక్, రాజేందర్ రెడ్డి, పాకాల శ్యామ్, ప్రశాంత్, కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.