హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో మర్యాద దినోత్సవం..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హుస్నాబాద్ డిపో సిబ్బంది ఆధ్వర్యంలో ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ఆదేశాల మేరకు బస్ స్టేషన్లో ప్రతి నెలలో మూడవ శుక్రవారం మర్యాద దినోత్సవం జరుపుకోనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు హుస్నాబాద్ బస్టాండ్ నందు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా ప్రయాణించు ప్రయాణికులకు గులాబీ పువ్వులను ఇచ్చుకుంటూ, అందులో ఒక ప్రయాణికుడికి శాలువాతో సత్కరించడం జరిగింది. దీంతోపాటుగా నిత్యం ప్రయాణికుల మన్ననలను పొందిన డ్రైవర్ మరియు కండక్టర్ కి సన్మానం చేయడం జరిగింది. టీజీ ఎస్ ఆర్టీసీకి చెందిన కీచైన్లను ఇవ్వడం జరిగింది ఈ కి చైన్ల పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే టీజీ ఎస్ ఆర్ టి సి కి సంబంధించిన అన్ని రకాల ఆప్స్ అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ ఎన్ వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ డ్రైవర్ మరియు కండక్టర్ అందరూ కూడా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించుతూ వారికి అవసరమైనటువంటి సేవల్ని అందిస్తూ ప్రజాధరణ పొందాలని అలాగే ప్రయాణికులు కూడా ఆర్టీసీని ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో ట్రాఫిక్ సూపర్డెంట్ మరియు ఎడిసిలు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సురేష్ మరియు బస్టాండ్ కంట్రోలర్ పాల్గొనడం జరిగింది.