సిద్దిపేట మున్సిపాలిటీ లో అవినీతి రాజ్యమేలుతుంది..
సమైక్యత వజ్రత్సవాళ్ళో 7.5 లక్షల అవినీతి.
ఇది మచ్చుకు మాత్రమే… సిద్దిపేట మున్సిపాలిటీ లో మొత్తం అవినీతే..
అధికారులపై చర్యలు తీసుకోవాలి…
బిఆర్ఎస్ కౌన్సిలర్ ధర్మవరపు బ్రహ్మం

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట జూన్ 29
సిద్దిపేట మున్సిపాలిటీ లో అవినీతి రాజ్యామేలుతుందని సిద్దిపేట పట్టణ 38 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరo బ్రహ్మం ఆరోపించారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 2022లో జరిగిన తెలంగాణ సమైక్యత వజ్రత్సవాళ్ళో దాదాపు 7.5 లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు. సిద్దిపేట మున్సిపల్ అధికారులు వజ్రత్సవాలకు సంబంధించిన ఖర్చు రూ, 30లక్షలు చూపేట్టారని వాటికి సంబందించిన బిల్లులు కలెక్టర్ కార్యాలయానికి అందించగా వారు రూ 7,50 లక్షలు, 15, లక్షలను చెక్కుల రూపం లో అందించారన్నారు. మిగతా రూ 7,50 లక్షలు క్యాష్ రూపం లో అందించారని అధికారులు స్వయంగా ఆర్ టి ఐ దరఖాస్తూ ద్వారా తెలిపారని అన్నారు. మున్సిపల్ ఎజెండా లో కేవలం రెండు చెక్కులు రూ 22,50 లక్షలు లెక్కలు మాత్రమే చూపించారని మరి క్యాష్ రూపంలో వచ్చిన రూ 7,50 లక్షలు, ఎందుకు చూపెట్టలేదని ప్రశ్నించారు. మరి ఆ నగదు రూపంలో ఉన్న డబ్బులు ఎటు వెళ్ళాయన్నారు. ఇలాంటి అవినీతి సిద్దిపేట మున్సిపాలిటీ లో రాజ్యం ఎలుతున్నారని ఇది మచ్చుకు మాత్రమే ఇలాంటి మరెన్నో అవినీతి జాడలు అక్కడ రాజ్యమేళుతున్నాయాన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులపై సిబిఐ, విజిలెన్స్ తో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవలన్నారు.





