మాజీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో వేల కోట్ల రూపాయల అవినీతి..- బిజెపి రాష్ట్ర నాయకులు దారం గురువా రెడ్డి సంచలన ఆరోపణలు

మాజీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో వేల కోట్ల రూపాయల అవినీతి..- బిజెపి రాష్ట్ర నాయకులు దారం గురువా రెడ్డి సంచలన ఆరోపణలు

మాజీ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో వేల కోట్ల రూపాయల అవినీతి..

– రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా

– బలవంతంగా భూములను లాక్కొని

– కార్పొరేట్ సంస్థలకు అధిక ధరలకు అమ్ముకున్న గత ప్రభుత్వం

– బిజెపి రాష్ట్ర నాయకులు దారం గురువా రెడ్డి సంచలన ఆరోపణలు

సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి

గజ్వేల్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు దారం గురువా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్ మరియు కలెక్టరేట్ పరిధిలో మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, వాటికి సంబంధించి వర్గల్ ఇండస్ట్రియల్ పార్క్ టిఎస్ఐఐసిలో 1350 ఎకరాలు దీనిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూములను లాక్కొని ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అధిక ధరలకు అమ్ముకొని గత ప్రభుత్వం లాభాలు గడించిందన్నారు. అందులో సర్వేనెంబర్ 845, 1209, 1266 లలో 371 ఎకరాలకు గాను ఒక దొంగ నోటిఫికేషన్ తో ఆక్రమించుకునే ప్రయత్నాన్ని హైకోర్టు ఆర్డర్ తో ఆపడం జరిగిందన్నారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు వారి పక్షాన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో కొట్లాడి తగిన నష్ట పరిహారం ఇప్పిస్తామని లేదా తమ భూములను కాపాడుకోవడానికి మమ్మల్ని సంప్రదించవచ్చని రైతుల పక్షాన బీజేపీ నిలబడుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి పేరుతో పేద రైతుల భూములను వేలాది ఎకరాలను కొల్లగొట్టి గత ప్రభుత్వం వారికి అండగా నిలబడుతున్న ఈనాటి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. రైతులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి పూర్తి న్యాయం జరిగేదాకా బిజెపి పోరాటం కొనసాగిస్తుందన్నారు.

*గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తవ్వుతున్నకొద్దీ అవినీతి*

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తవ్వుతున్నకొద్దీ అవినీతి బయటపడుతుందని బీజేపీ నేత గురువారెడ్డి ఆరోపించారు. ఆర్భాటంగా కట్టుకున్న మున్సిపల్ కార్యాలయంలో అన్ని అక్రమాలు అవినీతి రాజ్యమేలుతుందన్నారు. కరోనా సమయంలో ఒకరోజు ప్రారంభోత్సవం పేరుమీద అన్ని కిరాయలకు తెచ్చిన కుర్చీలు, టెంట్ హౌస్ సామాన్లు, ఇన్విటేషన్ కార్డ్స్, చాయ్ బిస్కెట్స్ పేరు మీద దాదాపు 29 లక్షల రూపాయలు దొంగ లెక్కలు రాసి మున్సిపల్ లో పనిచేస్తున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలిసి దోచుకున్న ఉదంతాన్ని వివరించారు. అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వక్ఫ్ బోర్డ్, సర్వే నెంబర్ 326 లో గజ్వేల్ పట్టణంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి క్యాంటీన్ కొరకు ఒక షెడ్డు స్పాన్సర్ చేసిన మణికొండ ఇంటి పేరు కల కుటుంబం, ఆ షెడ్డు స్థలంలో అక్రమంగా ఐదు ఇంటి నెంబర్లను రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, దానికి లింక్ డాక్యుమెంట్ కింద సర్వే నెంబర్ 328 లో గల ప్రైవేట్ స్థలం డాక్యుమెంట్ చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి
వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించుకున్న ఆ కుటుంబానికి దారాదత్తం చేయడం జరిగిందని మండిపడ్డారు.

*ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ కావాలంటే 50 వేల నుంచి లక్ష*

ప్రతిరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వస్తున్న ఫిర్యాదులలో భాగంగా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ కావాలంటే 50 వేల నుంచి లక్ష రూపాయలు వరకు మున్సిపల్ సిబ్బంది, అంతే మొత్తంలో స్థానిక కౌన్సిలర్లులకు లంచం ముట్ట చెప్పకపోతే ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి అక్రమాల పుట్ట గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది 48 గంటల్లో అక్రమంగా దొంగ లెక్కలు చూపి ఖర్చు పెట్టిన 29 లక్షల రూపాయలు మున్సిపల్ అకౌంట్ లో జమ చేయాలన్నారు. లేకపోతే వీరిపైన చీటింగ్ కేసు పెట్టి ఏసీబీకి ఫిర్యాదు చేసి  పదవులు ఉడేదాక కొట్లాడుతామన్నారు.

*వక్ఫ్ బోర్డు స్థలంలో అక్రమంగా ఇంటి రిజిస్ట్రేషన్*

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ వక్ఫ్ బోర్డు స్థలంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఐదు ఇంటి నెంబర్లను వెంటనే రద్దు చేయాలని లేకపోతే స్థానిక ప్రజల ఆగ్రహ జ్వాలల్లో మసి కాక తప్పదని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షుడు మనోహర్ యాదవ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండం శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చ జిల్లా అధికార ప్రతినిధి వెంకట్రాంరెడ్డి, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్, బీజేవైఎం జిల్లా నాయకులు మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *