ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించండి..
విద్యా వ్యాపారాన్ని అరికట్టండి
పర్మిషన్ లేని స్కూళ్ళను సీజ్ చేయండి
సిద్దిపేట ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిజేరిపోతుల జనార్ధన్
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా వ్యాపారానికి తెర లేపాయని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారని జిల్లా లో అలాంటి విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ విద్యాశాఖ అధికారులను కోరారు…బుధవారం రోజున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని ప్రయివేటు విద్యాసంస్థలను గుర్తించి,పర్మిషన్ లేకుండా నడుస్తున్న పాఠశాలలను సీజ్ చేయాలని,యూనిఫామ్ పుస్తకాల పేరుతో దోపిడీ చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి వెంకటేశ్వరెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్నకుమార్, జిల్లా నాయకులు బానోత్ నవీన్, జక్కుల అనిరుద్,సిద్దుల సుమన్ లు ఉన్నారు..