నియోజకవర్గ అభివృద్దే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
– పలు గ్రామాల్లో సిసి రోడ్డు పనుల శంకుస్థాపన
– నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి చేస్తా
– కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
నియోజకవర్గ అభివృద్దే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున దుబ్బాక మండలంలోని అప్పనపల్లి పెద్ద గుండవెల్లి ఆకారం గంభీర్పూర్ బలవంతపూర్ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా వచ్చిన డెవలప్మెంట్ నిధుల తో సిసి రోడ్ల శంకుస్థాపన చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వారన్నారు. త్వరలోనే రైతులందరికీ ఇందిరమ్మ భరోసా కింద 12 వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది అన్నారు. దుబ్బాక నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ముందుకు సాగుతానన్నారు. అంతేకాకుండా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం పిఎసిఎస్ డైరెక్టర్ బోయ యాదగిరి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగరి రవి, జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ , జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, నాయకులు గడిల జనార్దన్ రెడ్డి, సద్ది రాజిరెడ్డి ,ఆకుల భరత్ ,కిసరి స్వామి ,రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Posted inతాజావార్తలు తెలంగాణ
నియోజకవర్గ అభివృద్దే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
