గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసులో కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గత TRS ప్రభుత్వంలో గండిపల్లి గౌరవెల్లి రిజర్వాయర్ కు సంబంధించిన భూ నిర్వాసిత రైతులకు అండగా నిలిచి, వారి తరుపున పోరాడిన అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులైన అక్కు శ్రీనివాస్, కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, కోమటి సత్యనారాయణ, వల్లపు రాజు, పున్న సది, వెన్న రాజు, బంక చందు, బూరుగు కిష్ట స్వామి, శంకర్ రెడ్డి లపై నమోదైన కేసు విచారణలో భాగంగా శుక్రవారం రోజు హుస్నాబాద్ కోర్టుకు హాజరు అయినారు. ఇందులో భాగంగా నాయకులకు బెయిల్ మంజూరు అయినది.
ఈ సందర్భంగా హుస్నాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు మాట్లాడుతూ…అక్రమ కేసులతో ఒరిగేది ఏమీ లేదని, సాధించుకోవడానికి ఉద్యమమే సరైనదని, తెలంగాణ రాష్ట్ర సాధన అందుకు నిదర్శనం అని అన్నారు. గత TRS ప్రభుత్వంలో గండిపల్లి గౌరవెల్లి రిజర్వాయర్ కు సంబంధించిన భూ నిర్వాసిత రైతులకు రావలసిన బెనిఫిట్స్ అడిగినందుకు లాఠీచార్జి చేసి విచక్షణారహితంగా మహిళలని కూడా చూడకుండా కొట్టిన అప్పటి ప్రభుత్వం వారికి అండగా నిలిచిన ప్రతిపక్ష నాయకులమైన మాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని, రిజర్వాయర్లో సర్వస్వం కోల్పోయిన రైతులు, రైతు కుటుంబాలకు అన్ని విధాలుగా బెనిఫిట్స్ రావాలని వారికి అండగా నిలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కేసులో కాంగ్రెస్ నాయకుల తరపున కేసును వాదిస్తున్న న్యాయవాదు లు చిత్తారి రవీందర్, సుంకే రాజశేఖర్లకు మరియు బెయిల్ ఇచ్చిన బంక లక్ష్మీ మరియు బోనాల అనుష కు ధన్యవాదాలు తెలిపారు.
