గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన కాంగ్రెస్ నాయకులు, వినతిపత్రం సమర్పణ..

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన కాంగ్రెస్ నాయకులు, వినతిపత్రం సమర్పణ..

అందుబాటులో ఉండి అండగా నిలవండి..
కేసీఆర్ అందుబాటులో లేకనే ఏడాదిగా పంచని కళ్యాణ లక్ష్మి చెక్కులు..
గజ్వేల్ పేదలకు తప్పని ఇబ్బందులు..
అసంపూర్తి పనులు పూర్తి చేయాలని డిమాండ్..
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన కాంగ్రెస్ నాయకులు, వినతిపత్రం సమర్పణ..

సిద్దిపేట టైమ్స్, ప్రత్యేక ప్రతినిధి;
      గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడం వల్లే గజ్వేల్ లబ్ధిదారులకు గత ఏడాదిగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరగడంలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ముట్టడించి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలి రాగా, క్యాంపు కార్యాలయంలో ఎవరు అందుబాటులో లేకపోవడాన్ని  విమర్శించారు. 2022- 23 వరకు కళ్యాణ్, లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరగడంలేదని నియోజకవర్గానికి సంబంధించిన సుమారు 900 చెక్కులు పంపిణీ చేయకుండా నిలిచిపోయినట్లు వారు పేర్కొన్నారు. ఇందులో కొన్ని లాప్స్ అయినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడం వల్లే ఈ చెక్కుల పంపిణీ జరగడంలేదని ఆరోపించారు. సిద్దిపేట, చేర్యాల, దుబ్బాక, మెదక్ తదితర నియోజకవర్గాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని గజ్వేల్ లో మాత్రం కేసీఆర్ ప్రతిపక్షనేతగా స్థానిక కాంగ్రెస్ నాయకులు గౌరవంతో పంపిణీ చేయకుండా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల గజ్వేల్ లో జరిగిన మంత్రుల కార్యక్రమం లో కూడా ప్రోటోకాల్ ప్రకారం చెక్కులను పంపిణీ చేయలేదన్నారు. అయితే టిఆర్ఎస్ నాయకులు మాత్రం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. దసరా లోపు వీటిని పంపిణీ చేసి 900 మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కేసీఆర్ ను వారు కోరారు. గజ్వేల్ లో బస్టాండ్ నిర్మాణం పెండింగ్ లో ఉందని, రింగ్ రోడ్డు సైతం అసంపూర్తిగా ఉందని, వీటిని వెంటనే పూర్తి చేయాలని తగిన చర్యలు కేసీఆర్ చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టణ పేదలు  ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను గుర్తించినా వారికి ఇండ్లను కేటాయించకపోవడంతో స్థానిక పేదలు ఆందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. వెంటనే వారికి ఇండ్లు కేటాయించాలని కోరారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని, గజ్వేల్ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేయాలని కోరారు.  పండుగలోపు చెక్కులను పంపిణీ చేయకపోతే తమ నిరసనను మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. కాగా క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఇతరులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో సదరు వినతిపత్రాన్ని గోడకు అతికించారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్ శ్రీనివాస్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, సుకేందర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *