హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం

ప్రజా పాలన ఉత్సవాలు కాదు… మోసపూరిత ఉత్సవాలు

బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు

సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :


తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయక మోసం చేసిందని, ప్రజా పాలన పేరిట 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆరోపించారు.
పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శంకర్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ స్కాం లకు బ్రాండ్ అంబాసిడర్ అని, దేశాన్ని దోచుకుని లూటీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై అవాకులు- చవాకులు పేల్చి విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. నేషనల్ హెరాల్డ్, 2 జీ స్పెక్ట్రమ్, కోల్ స్కాం, కామన్ వెల్త్ గేమ్స్ స్కాం, ఆగష్టావేస్ట్లాండ్ స్కాం, ఆదర్శ్ హౌసింగ్ స్కాం, బోఫోర్స్ స్కాం ఇలా అనేక స్కాంలు చేసి అవినీతికి పాల్పడి, దేశ ఆర్థికాభివృద్ధిని చెల్లాచెదరు చేసి నాశనం చేసిందని విమర్శించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 ఏండ్లుగా అవినీతి రహిత పాలన అందిస్తూ, దేశ ప్రజల మన్ననలు పొంది, 3వ సారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజల పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కు చిత్త శుద్ధి ఉంటే హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి,హుస్నాబాద్ మోడల్ టౌన్ గా మార్చడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో సబ్ కోర్టు మంజూరు చేయాలని, పట్టణ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అర్బన్ తహశీల్దార్ కార్యాలయం పట్టణంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పోలీసు స్టేషన్ నూతన భవనం నిర్మాణానికి నిధుల మంజూరు కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే హామీ ఇప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో క్రీడాకారులు క్రీడలు ఆడుకోవడానికి సరైన సౌకర్యాలు, సక్రమంగా మైదానం లేదని, జాతీయ స్థాయి పోటీలకు అనుగుణంగా మినీ స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఇవి ప్రజా పాలన ఉత్సవాలు కాదని, మోసపూరిత ఉత్సవాలు అని వ్యాఖ్యానించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు వేముల దేవేందర్ రెడ్డి, బోనగిరి రవి, వరియోగుల అనంతస్వామి,పోలోజు రవీందర్, వెల్దండి సంతోష్,మహిళా మోర్చా నాయకురాలు లకావత్ శారద, పట్టణ ప్రధాన కార్యదర్శి పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మయ్య, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్,  నాయకులు బోనగిరి రాజేష్, బీసా శ్రీకాంత్, నగేష్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *