ప్రభుత్వ పాఠశాలలో కండోమ్ ప్యాకెట్ల కలకలం
సిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట (సెప్టెంబర్,21):
ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లి MPPS ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు పడి ఉండి కలకలం
రేగింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కొందరు యువకులు పాఠశాల ఆవరణంలో తిరుగుతున్న సమయంలో అక్కడ అక్కడ కండోమ్ ప్యాకెట్లు పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.దీంతో ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో వైరల్ చేశారు. గతంలో కూడా ఇదే మాదిరిగా పాఠశాలలో మద్యం బాటిల్ లు పడి ఉన్న సంఘటనలు ఉన్నాయి. పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా ఆకతాయిలు ప్రభుత్వ పాఠశాలలో ఇష్టారాజ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో కండోమ్ ప్యాకెట్ల కలకలం





