పశువుల అక్రమ దందా పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ మున్సిపాలిటీ లో ప్రతి శుక్రవారం జరిగే అంగడి లో వెటర్నరీ డాక్టర్ అనుమతులు లేకుండా కటిక వ్యాపారస్తులు ఇష్ట రాజ్యాంగ పశువులను కొనుగోలు చేస్తూ పశువద శాలలకు తరలిస్తున్నరని, వెంటనే పశువుల అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు హుస్నాబాద్ నియోజకవర్గ బి ఎస్ పి పార్టీ పక్షాన, కిసాన్ సంఘ్ రైతు సంఘాల పక్షాన సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పశువుల అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని నెల రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ కి, మరియు పట్టణ ఎస్సైకి ఫిర్యాదు చేయడం జరిగిందని, బి ఎస్ పి పార్టీ, రైతు సంఘాల పోరాటాలతో వెటర్నరీ డాక్టర్ను నియమించారు కానీ డాక్టర్ కు తగినంత సిబ్బంది ఇవ్వకుండా అంగడిలో పశువుల కొనుగోలు విషయంలో విచారణ జరిపే సమయంలో మరియు నిబంధనలకు విరుద్ధంగా పశువదశాలలకు తరలిస్తున్న వాహనాలపై వ్యాపారస్తులపై కేసులు నమోదు చేయడం లేదని, పశువుల అక్రమ తరలింపు పై సాక్షాదారాలు ఇచ్చిన లాభం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు సోమవారం ఫిర్యాదు చేసామన్నారు. కూరగాయలు, వివిధ పనిముట్లు, రైతులు ఎద్దులు, ఆవులు, బర్రెలు, దున్నపోతులు, దూడలు వారి వ్యవసాయ అవసరాల కొరకు హుస్నాబాద్ లో అంగడి స్థాపించారని, కానీ పట్టణ అంగడి 30 శాతం కటిక వ్యాపారస్తులతోనే నడుస్తుందని, వీరి కొనుగోలు తో చుట్టు 10 మండలంలో పశుసంపద దారుణంగా తగ్గిపోతుందన్నారు. రాను రాను రైతులకు ఇక్కడ పశువులు దొరికే పరిస్థితి లేదని, భవిష్యత్తులో రైతులకు ఉపాధి లేకుండా అవుతుందన్నారు. పశువుల ధరలు బాగా పెరుగుతాయి కాబట్టి వెంటనే పశువుల అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ఫిర్యాదు ఇచ్చిన వారిలో బిఎస్పి పార్టీ నియోజకవర్గ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, కిసాన్ సంగ్ హుస్నాబాద్ డివిజన్ ఇంచార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బి ఎస్ పి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్, అధ్యక్షులు వేల్పుల రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.