హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం
రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలి
ప్రతిరోజు సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వాహనాల తనిఖీ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు నివారించాలి
గణేష్, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా పీస్ కమిటీ మీటింగులు ఏర్పాటు చేయాలి
వినాయక మండపాల ఆర్గనైజర్లతో ఎస్ఐలు సమావేశాలు నిర్వహించాలి
గణేష్ మండపాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి
ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీస్ సింగ్ విధులు నిర్వహించాలి
డయల్ 100 కాల్ కు వెంటనే స్పందించాలి
సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
శనివారం సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ హుస్నాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించి కేసుల వివరాల గురించి ఎసిపి, సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదాలు జరిగిన ప్రదేశంలో వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి తగు చర్యలు తీసుకోవాలి, ప్రతిరోజు సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ వాహనాల తనిఖీ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారించాలి, బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా సైనింగ్ బోర్డ్స్, స్టెడ్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్లతో తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. రాత్రి సమయాల్లో రోడ్డుపై వాహనాలు నిలపకుండా చూడాలి.
వినాయక చవితి/గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా పీస్ కమిటీ మీటింగులు ఏర్పాటు చేయాలని సూచించారు. వినాయక మండపాల ఆర్గనైజర్లతో కూడా సంబంధిత ఎస్ఐలు సమావేశాలు నిర్వహించాలి. గణేష్ మండపాలు మరియు నిమజ్జన కార్యక్రమంలో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి సమన్వయంగా విధులు నిర్వహించాలి. వినాయక నిమజ్జనం చేసే చెరువు/కుంటలను సంబంధిత అధికారులతో కలిసి సందర్శించాలని సూచించారు.
పెండింగ్ కేసులను విచారణ చేసి త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు. ఒక వ్యక్తిపై షీట్ ఓపెన్ చేసేముందు అతని పూర్తి వివరాలు బయోడేటా బంధువుల వివరాలు ఇంట్రాగేషన్ రిపోర్ట్ తీసుకొని షీట్ ఓపెన్ చేయాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ లో ఎఫ్ఐఆర్, సిడిఎఫ్, పార్ట్ వన్, పార్ట్ టూ, రిమాండ్ డైరీ, చార్జిషీట్ సీసీ నెంబర్ డాటా ను ఏరోజు కారోజు ఎంట్రీ చేయాలి. పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ డాటానే పరిశీలిస్తారు. దీని ప్రకారమే రివ్యూలు నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సస్పెక్ట్ రౌడి కేడి డిసి సీట్లను ప్రతి నెల రివ్యూ చేయాలని సంబంధిత ఏసీపీలకు సూచించారు.
పోలీస్ స్టేషన్లో కేసులలో ఉన్న క్రైమ్ వెహికల్ కోర్టులో కేసు డిస్పోజల్ కాగానే వెంటనే సంబంధిత యజమానికి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అందజేయాలని సూచించారు. గంజాయి కేసులలో ఉన్న నిందితులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐలు చేర్యాల సిఐ శ్రీను, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్, ఐటీ సెల్ ఎస్ఐ నరేందర్ రెడ్డి, ఎస్ఐలు మహేష్, విజయ్ భాస్కర్, నిరేష్, రాజు, షేక్ మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.