“బహుజన బతుకమ్మ” వేడుకకు తరలిరండి
అక్కన్నపేటలో బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ
7న ఛలో హుస్నాబాద్ కు జేఏసి నాయకుల పిలుపు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 7న జరిగే బహుజన బతుకమ్మ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని జేఏసీ నాయకులు పిలుపు నిచ్చారు. అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం రోజున బహుజన బతుకమ్మ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ (గోడ పత్రిక)ను పలువురు అధికారులు, మహిళలతో కలిసి జేఏసి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో పుట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బతుకమ్మ సంప్రదాయం మనందరికీ ఎంతో గర్వకారణం అన్నారు. ప్రకృతిలో లభించే పూలని దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ఇంటింటా ఆనందాలను పంచుతుందని అన్నారు. బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వేడుకలు, ఈ నెల 7న సాయంత్రం హుస్నాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుణోదయ విమలక్క, రాష్ట్ర రవాణా, బిసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారని అన్నారు. అక్కన్నపేట మండల ప్రజలు సైతం అత్యధికంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడివో జయరాం నాయక్, జేఏసీ నాయకులు ముక్కెర సంపత్ కుమార్, తొందూరి ఎల్లయ్య, పొడిశెట్టి కుమారస్వామి, వేముల జగదీశ్, గంపల శ్రీనివాస్, జక్కుల రమేష్, జనగోని శ్రీనివాస్, ఏపిఓ ప్రభాకర్ గౌడ్, ఏపియం శ్రీనివాస్, పంచాయితీ కార్యదర్శి లక్ష్మీకాంతారావు, సిసిలు గొర్ల తిరుపతి, గిరిమల్ల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, నాయకులు టేకుల కుమార్, పులికాశి రమేష్, మహిళా సమైక్య నాయకురాల్లు బొడిగం సూరవ్వ, స్పందన, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.