సీఎం ముఖచిత్రంతో అగ్గిపెట్టలో పట్టే బంగారు శాలువా..!
యాదాద్రిలో సీఎంకు బహుకరించిన హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్..
సిద్దిపేట టైమ్స్ డెస్క్:

సిరిసిల్ల చేనేత కార్మికుడు నల్ల విజయ్ తండ్రి నల్ల పరంధాములు అగ్గి పెట్టలో పట్టే పట్టు చీరను సృష్టించి సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పారు. అదే తరహాలో గతంలో నానో బ్యాగ్ 3 ఇంచుల బ్యాగులను మరియు చింతాకుల నుంచి దూరే చీర తయారు చేశారు, అదే తరహాలో ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖచిత్రం చేయాలని తపనతో అగ్గి పెట్టెలో పట్టే బంగారు శాలువాని తయారు చేశానని…దీనిని రెండు గ్రాముల బంగారం ఉపయోగించి నెయ్యడం జరిగిందని, దీని వెడల్పు 34 ఇంచులు పొడవు రెండు మీటర్లు దీని బరువు 200 గ్రాములు ఉండడం చాలా విశేషం ఇది నేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం రోజున యాదాద్రి గుడి లో సిరిసిల్ల కు చెందిన చేనేత కార్మికుడు విజయ్ సిఎం ముఖ చిత్రం తో నేసిన శాలువా ను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సిఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంఎల్ఏ ల సమక్షం లో హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ముఖ్యమంత్రి కి బహుకరించారు. గత ఉగాది రోజున కూడా హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుక లో మంత్రి పొన్నం ప్రభాకర్ కి కూడా ఇదే తరహా లో బంగారు పూత తో నేసిన అగ్గి పెట్టే లో ఇమిడే శాలువా అక్కు శ్రీనివాస్ అందించారు.