హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమం
పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన హుస్నాబాద్ ఏసిపి వి. సతీష్, సీఐ శ్రీనివాస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛధనం పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా మంగళవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హుస్నాబాద్ ఏసిపి వి. సతీష్, సీఐ శ్రీనివాస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి వి. సతీష్ మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ స్వచ్ఛతనంగా ఉంచుకోవాలని, హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లో మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ గురించి మొక్కలు నాటడం చాలా ముఖ్యమన్నారు. ఈనాటి మొక్కలే రేపటి వృక్షాలని భావితరాల వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం గురించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కోహెడ ఎస్ఐ తిరుపతి, హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.