హుస్నాబాద్ 17 వ వార్డులో “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమం హుస్నాబాద్ లోని 17 వార్డులో కౌన్సిలర్ వల్లపు రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. సరస్వతి శిశు మందిర్ విద్యార్థులతో వార్డులో ర్యాలీ నిర్వహించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిసరాల పరిశుభ్రత పాటించాలని, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటిలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, ఈ ఐదు రోజులే కాకుండా ప్రతిరోజు స్వచ్ఛత ను పాటించాలని, ఆహారం వృధా చేయకూడదని, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని వార్డు ప్రజలకు వల్లపు రాజు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, వార్డు ప్రజలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.