ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి… హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో “సఫాయి అప్నా బీమారి భగవో” కార్యక్రమం లో భాగంగా పురపాలక సంఘం చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఎంపీడీవో కార్యాలయం ముందున్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును, ఆర్టీసీ డిపో రోడ్ లో ఉన్న కరీంనగర్ పాల డైరీ కి సంబంధించిన వాటర్ ప్లాంట్ ను సందర్శించారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజలకు సరఫరా అవుతున్న వాటర్ ను బ్లీచింగ్ టెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న వాటర్ ప్లాంట్ లు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాటర్ లో కెమికల్స్ ను ఎక్కువ మోతాదులో వాడకూడదని, ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని వాటర్ ప్లాంట్ యజమానులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అనిత రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, జవాన్ ప్రభాకర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
