ప్రెస్ ఫోటో గ్రాఫర్ లను రెస్క్యూ చేసిన సీఐ వాసుదేవరావు

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
భారీ వర్షాలకు సిద్దిపేట పట్టణం జలమయం అవడంతో విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు పత్రిక ఫోటోగ్రాఫర్లు బాబురావు, శ్రావణ్ కుమార్ లు శ్రీ నగర్ కాలనీ ఎంఆర్ఓ కార్యాలయం పక్కనఓ బహులా అంతస్తు పైకి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లారు. కానీ మధ్యలోనే కరెంటు పోవడంతో ఇద్దరూ అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీలో వరదల్లో చిక్కుకున్న స్థానికులను రక్షించడానికి వచ్చిన బిఆర్ఎస్ నాయకులు బాబు జానీ, గ్యాదరి రవి లకు సమాచారం ఇవ్వగా వాళ్ళు వెంటనే వన్ టౌన్ సిఐ వాసుదేవరావు కి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిఐ హుటాహుటిన తన సిబ్బందితో భవనం వద్ద చేరుకొని భవనం వాచ్మెన్ కు జరిగిన విషయం చెప్పి.. జనరేటర్ ఆన్ చేయించి.. ఇద్దరినీ క్షేమంగా కిందికి తీసుకువచ్చారు. దీంతో ఫోటోగ్రాఫర్లు ఇద్దరు సిఐ వాసుదేవరావు, బీఆర్ఎస్ నాయకులు బాబు జానీ, గ్యాదరి రవి లకు కృతజ్ఞతలు తెలిపారు.






