చిన్న గురిజాల సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్ ప్రచారానికి విశేష స్పందన
సిద్దిపేట టైమ్స్ చిన్న గురిజాల :
బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్‌కు గ్రామంలో భారీగా ప్రజా మద్దతు వ్యక్తమవుతోంది. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ శంకర్, పార్టీ కార్యకర్తలు గ్రామంలో నిర్వహించిన తిరుగు ప్రచారానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రచారం సాగిన ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోతు శంకర్ మాట్లాడుతూ—గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సాధన కోసం ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని వెల్లడించారు. బి ఆర్ ఎస్ అధికారంలో లేకున్నా, గ్రామానికి అవసరమైన నిధుల కోసం అన్ని ప్రయత్నాలు చేసి అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. తమకు ఒక అవకాశం ఇస్తే చిన్న గురిజాల అభివృద్ధి మండలంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఉంగరం గుర్తుకే గ్రామ ప్రజలు ఏకగ్రీవ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
Posted inవరంగల్
చిన్న గురిజాల సర్పంచ్ అభ్యర్థి పోతు శంకర్ ప్రచారానికి విశేష స్పందన





