సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా చీకట్ల రవీందర్ గౌడ్ నియామకం.
సిద్ధిపేట టైమ్స్, వెబ్;

సిద్దిపేట జిల్లా సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము అధ్యక్షునిగా హుస్నాబాద్ పట్టణానికి చెందిన చీకట్ల రవీందర్ గౌడ్ ను నియమించి నియామక పత్రాన్ని రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ అందజేశారు.ఈ సందర్భముగా చీకట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతు నా మీద నమ్మకంతో నన్ను నియమించిన రాష్ట క్షమిటికి కృతజ్ఞతలు తెలియజేస్తు జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసి గౌడ కల్లు గీతా కార్మికులకు అండగా ఉంటానని సర్వాయిపాపన్న పోరు వారసునిగా జాతి బిడ్డల సంక్షేమానికి పాటు పడతానని జిల్లాలో పూర్తిస్థాయిలో అన్ని మండలాల్లో కమిటీ వేసి జిల్లా పూర్తి స్థాయి కమిటీ నియమించి గ్రామస్తాయికి తీసుకుపోయి పలు గీతా కార్మికుల సమస్యలు సంఘము రాష్ట కమిటీ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తానని రవీందర్ గౌడ్ అన్నారు.అలాగే హుస్నానాద్ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ బీసీ సంక్షేమశాఖ మంత్రి గౌరవనీయులు అన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ గీతాకార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని త్వరలో ఈ ప్రాంత గౌడ గీతాకార్మికుల సమస్యలపై ఒక నివేదిక తయారు చేసి అందజేస్తామని జిల్లా అధ్యక్షునిగా నియామకమైన చీకట్ల రవీందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యక్షుని చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
ఈ కార్యక్రమoలో రాష్ట ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్, స్థానిక గౌడ సంఘము నాయకులు మాజీ ఎంపీటీసీ కేక్కర్ల సంపత్ గౌడ్, పచ్చిమట్ల ఎల్లయ్య గౌడ్, పచ్చిమట్ల రాంబాబు గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, పచ్చిమట్ల సత్యం గౌడ్, ముంజ నారాయణ గౌడ్, ముత్తయ్య గౌడ్, అనాగోని రమేష్ గౌడ్, ఆకుల శ్రీను గౌడ్, ముంజ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.