చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి..
10వ తరగతి పాస్ అయిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పది వేల రూపాయలు ఇవ్వాలి..
బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సామల్ల సాయిప్రేమ్, గుడికందుల నరేష్, భూక్య భిక్షపతి, సందులపురం దుర్గా ప్రసాద్..
సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక అమలుకాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 10వ తరగతి పాస్ అయిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పది వేల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం (SSGGAP) ద్వారా ప్రతి గూడెం , తండాలకు ప్రతీ ఏడు ఇస్తానన్న 25లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు సామల్ల సాయిప్రేమ్ , గుడికందుల నరేష్, భూక్య భిక్షపతి నాయక్, సందులపురం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.