ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తి..
ఇంటి ముందు బాధితురాలు టెంట్ వేసుకొని ధర్నా..
సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి
భూంపల్ అక్బర్ పేట మండలం రామేశ్వరం పల్లి గ్రామానికి చెందిన పల్లె శ్రీకాంత్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పల్లే కవిత అనే యువతితో ఆరు సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని అనేక రకాలుగా వాడుకొని నేడు నాకు సంబంధం లేదంటూ అమ్మాయి ఎవరో తెలియాదని తప్పించుకోవడం తో అమ్మాయి తనని పెళ్ళి తప్పకుండా చేసుకోవాలంటూ ఇంటి ముందు ధర్నాకు దిగగా ఇరువర్గాలు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. స్థానికులు పోలీస్ లకు తెలియజేయగా పోలీస్ లు అక్కడకి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి శ్రీకాంత్ ను దుబ్బాక పోలీస్ స్టేషన్ కు తరలించారు. కానీ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకోవాలని గ్రామస్తులతో కలిసి ఇంటి ముందు నిరహర దీక్ష చేపట్టింది. ఎది ఏమైనప్పటికీ ఈ ప్రేమ వ్యవహారం పోలీస్ లకు కోరకారని కొయ్యలగా మారింది.