చందులాపూర్ ముసుగు దొంగల వీరంగం – గ్రామస్తుల్లో భయం..
సిద్దిపేట టైమ్స్, చిన్నకోడూరు.
సిద్దిపేట్ జిల్లా చిన్నకోడూరు మండలం చందులాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగల వీరంగం చోటుచేసుకుంది.
రాత్రి సుమారు 11 గంటల సమయంలో చందులాపూర్ గ్రామంలోని బీసీ కాలనీలో ముసుగు ధరించిన ముగ్గురు దొంగలు రెండు ఇళ్లపై దాడి చేయడానికి ప్రయత్నించారు.
నల్ల బట్టలు ధరించి బైక్పై వచ్చిన దొంగలు గేట్లు దూకేందుకు ప్రయత్నించగా, సంఘటనను గమనించిన గ్రామ యువకులు కేకలు వేయడంతో దొంగలు రాళ్లతో దాడి చేయబోయారు. అయితే ఆ తర్వాత వారు అక్కడి నుండి పరారయ్యారు.
ఈ దొంగలు వీధుల్లో వీధిలైట్లు లేకపోవడం వల్ల చీకటి ప్రాంతాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గ్రామంలోనీ బీసీ కాలనీలో వీధిలైట్ల ఏర్పాటుపై గ్రామస్థులు గతంలోనే అధికారులు, విలేజ్ సెక్రటరీకి అనేకసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటికీ స్పందనలేకపోవడం గమనార్హం.
ఈ ఘటనపై యువకులు వెంటనే వినాయకుల వద్దకు వచ్చిన పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల మండలంలో రైల్వే పనుల నిమిత్తం ఉత్తర భారత రాష్ట్రాలైన యూపీ, బీహార్ ప్రాంతాల నుండి వచ్చిన కూలీలు పనిచేస్తుండటంతో, ఈ దొంగతనానికి వారే సంబంధించి ఉంటారనే అనుమానాలు గ్రామస్థుల్లో వ్యక్తమవుతున్నాయ





