స్వచ్ఛదనం… పచ్చదనం ను జయప్రదం చేయాలి.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ఈ నెల 5 నుండి 9 వరకు ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన “స్వచ్ఛదనం… పచ్చదనం” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ టౌన్ తో పాటు, అన్ని గ్రామాల్లో చెత్తను తొలగించి, మొక్కలు నాటాలని, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా, మురుగు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకంతో వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు.
పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు, యువజన స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. వన మహోత్సవం ద్వారా ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలన్నారు. మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛతనం పచ్చదనం దోహదపడుతుందని మంత్రి పొన్నం అన్నారు.