చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
లంబాడీల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని గిరిజన నాయకుల పిలుపు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 19వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్లో జరగనున్న లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ –
1976లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సాధించుకున్న ఎస్టీ రిజర్వేషన్లు ప్రస్తుతం కుట్రలతో కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెల్లం వెంకట్రావు, సోయం బాపూరావు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో 37 లక్షల మంది లంబాడీల హక్కుల రక్షణ కోసం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి సోయం బాపూరావు, తెల్లం వెంకట్రావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే పిటిషన్పై సుప్రీంకోర్టు రాష్ట్రాల అభిప్రాయం కోరినందున, తెలంగాణ ప్రభుత్వం లంబాడీలకు అనుకూలంగా సానుకూల అభిప్రాయం తెలియజేయాలని కోరారు. తండాలు, గ్రామాల నుండి అధిక సంఖ్యలో లంబాడీలు హాజరై ఈనెల 19న హైదరాబాద్ ఇందిరా పార్క్లో జరగనున్న సభను విజయవంతం చేయాలని గిరిజన నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాలోతు బీలు నాయక్, భూక్య మంగ శ్రీనివాస్, గూగుల్ రాజు, గూగుల్ శివరాజ్ నాయక్, మాలోతు సత్యం నాయక్, ధరావత్ తిరుపతి, లావుడియా బిక్షపతి నాయక్, భూక్య మోతిలాల్ నాయక్, నునావత్ మోహన్ నాయక్, గూగుల్ కృష్ణ నాయక్, బానోతు అనిల్ నాయక్, రేనా నాయక్, సంపత్ నాయక్, తిరుపతి నాయక్, అంబుత్ రాజు నాయక్, లాలూ నాయక్, కాళిదాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.





