రౌడీ పీటర్లకు మద్దతు పలుకుతూ, కార్యకర్తల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు..
సిద్ధిపేటలో భూకబ్జాలకు పాల్పడిన వారితో ల్యాండ్ మాఫియా..
మైనంపల్లి వ్యవహరంతోనే రాజీనామా..
కాంగ్రెస్ కు చక్రధర్ గౌడ్ రాజీనామా..
రౌడీ పీటర్లకు మద్దతు పలుకుతూ, కార్యకర్తల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు..
సిద్ధిపేటలో భూకబ్జాలకు పాల్పడిన వారితో ల్యాండ్ మాఫియా..
మైనంపల్లి వ్యవహరంతోనే రాజీనామా..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి; ఆగస్టు 10


ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు లేఖ రాశారు. పార్టీలో పదవి ఇచ్చిన ఇవ్వకున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళుతూ పార్టీ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేశానని చెప్పారు. “సిద్దిపేటకు ఎలాంటి సంబంధం లేని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సిద్దిపేటలో పెత్తనం చేలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడుతున్న నన్ను తల్లి పేరు పెట్టి అసభ్యంగా పది మందిలో తిట్టడం నన్ను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాతో తిరిగే కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ పోలీసు కేసులు, రౌడీ షీట్లు పెడుతూ వేదిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్ధిపేటలో భూకబ్జాలకు పాల్పడిన వారిని పార్టీలోకి తీసుకొని, ల్యాండ్ మాఫియా, రౌడీ పీటర్లకు మద్దతు పలుకుతూ, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నార”ని స్పష్టం చేశారు. మైనంపల్లి పై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనను తీవ్రంగా కలచి వేడినదని, అధికార పార్టీలో ఉంటే ఎన్నో అవకాశాలు వస్తాయని తెలిసినా.. తాను నమ్మిన సిదంతం కోసం తనను నమ్ముకున్న రైతులు, పేద ప్రజలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇంతకాలం తనను ఆదరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సిద్ధిపేట కాంగ్రెస్ కార్యకర్తలకు చక్రధర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.