వాకింగ్ వెళ్లిన మహిళ మెడలో చైన్ స్నాచింగ్..
భయాందోళనలో గ్రామస్తులు..
సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి
సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండల కేంద్రంలో ఘోరం జరిగింది. పోలీస్ స్టేషన్ వెనకాల, వెంచర్ లో ఓ మహిళ వాకింగ్ వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమే తలపై దాడి చేసి మెడలోంచి పుస్తెలతాడు లాక్కెల్లారు. అదే గ్రామానికి చెందిన రంగయ్యగారి అన్నపూర్ణ (52) రోజు మాదిరిగానే వాకింగ్ చేస్తుంది. అప్పుడే గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బంగారు గొలుసు ఇవ్వాలని బెదించగా ఆమె ఇవ్వకపోవడంతో తలపై బలంగా కొట్టి పుస్తెలతాడు లాక్కెల్లినట్టు తెలుస్తుంది. బాధితురాలిని సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కి తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరం లో ఈ సంఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.