చాయి దొరకడం కష్టం- మద్యం దొరకడం చాలా ఈజీ
– తెల్లవారుజాము నుండి పాన్ షాపుల్లో మద్యం అమ్మకాలు
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
ఆనాటి కాలంలో ప్రజలు తెల్లవారితే చాయ్ కోసం ఎదురు చూసేవారు, కానీ నేటి కాలంలో దానికి విరుద్ధంగా మద్యం ఎప్పుడు దొరుకుతుందా అని ప్రజలు తెల్లవారడంతోనే రోడ్డుపైకి వస్తున్నారు. దుబ్బాక పట్టణంలో పోచమ్మ ఆలయం పక్కన ఒక పాన్ షాప్ లో తెల్లవారుజాము ఐదు గంటల నుండి అక్రమంగా మద్యం అమ్మకాలు జోరుగా ప్రజలకు అందుతున్నాయి. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపు రద్దు చేయాలంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, దుబ్బాక పట్టణంలో మాత్రం తెల్లవారు జామునుంచే జోరుగా మద్యం అమ్మతు ప్రజల ఆరోగ్యలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా పాన్ డబ్బాల వద్ద అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని నిలువరిస్తే ఎంతోమంది ప్రాణాలు నిలుస్తాయి. కానీ ఎక్సైజ్ అధికారులు ఇటువైపు రాకపోవడం బెల్ట్ షాపులను అక్కడి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదేమైనా దుబ్బాక పట్టణంలో మాత్రం జోరుగా ఉదయం నుండే మద్యం విక్రయించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు వాటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Posted inతాజావార్తలు దుబ్బాక
చాయి దొరకడం కష్టం- మద్యం దొరకడం చాలా ఈజీ
