కన్నతల్లిని చంపిన కసాయి కొడుకులు అరెస్టు..
-తొగుట సీఐ షేక్ లతీఫ్.
సిద్దిపేట టైమ్స్- దౌల్తాబాద్
కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కి పంపడం జరిగిందని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. శనివారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చ్ 06 గురువారం ఉదయం 10:00 గంటలకు నిందితులు ముగ్గురు కలిసి మెదక్ జిల్లా శంకరంపేట మండలం కోర్విపెల్లి గ్రామానికి చెందిన మృతురాలు సింగమొల్ల లక్ష్మి( 49) ఆమెను కొన్ని రోజుల నుండి కుటుంబంలో జరుగుతున్న గొడవల విషయంలో చంపాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారమే గురువారం ఉదయం 10:00 గంటలకు బండరాయితో తలపై కొట్టగా బలమైన రక్త గాయాలు కాగా వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అదే రోజు సాయంత్రం 6:00 గంటలకు లక్ష్మీ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టగా మెదక్ జిల్లా శంకరంపేట మండలం కోర్విపెల్లి గ్రామానికి చెందిన మృతురాలి కొడుకు కోడలు సింగమొల్ల స్వామి- సింగమొల్ల మౌనిక అలాగే సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన చామంతి బాలమణి ముగ్గురు నిందితులు కలిసి లక్ష్మిని బండరాయితో దాడి చేసి హత్య చేశారు. ఈ ముగ్గురు నిందితులను విచారించగా ఒక సంవత్సరం క్రితం నిందితుడు స్వామికి కూతురు పుట్టింది. కూతురు పుట్టిన మూడు రోజులకు స్వామి తండ్రి మరణించినందున అప్పటి నుండి వారి సంసారంలో గొడవలు జరుగుతున్నాయి.ఈ గొడవలు మనసులో పెట్టుకుని పై ముగ్గురు నిందితులు కలసి లక్ష్మిని బండరాయితో కొట్టి హత్య చేయడం జరిగిందని ఒప్పుకోవడం జరిగిందన్నారు. ముగ్గురు నిందితులు
నేరం ఒప్పుకున్నందున, నేరస్తులు నేరం చేయడానికి ఉపయోగించిన బండరాయి, మోటార్ సైకిల్ రెండు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ముగ్గురి నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని తొగుట సిఐ లతీఫ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.