బైక్ ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్,
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు బైక్ ను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో.. ఒకరు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులు నాయక్ తండ జంక్షన్ వద్ద హుస్నాబాద్ డిపోకు చెందిన టీ ఎస్ 36 టీ 7327 నెంబర్ గల హెయిర్ విత్ ప్రైవేట్ బస్సు.. వ్యవసాయ పనులకి బైక్ మీద వెళ్తున్న వారిని ఢీ కొట్టింది. బైక్పై ఉన్న కరంటోతు రాజు, కరంటోతు స్వరూప తీవ్ర గాయాలు కాగా.. రాజు భార్య కరెంటు కరంటోతూ కవిత అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్ర గాయాల పాలైన రాజు, స్వరూప లను కూడా ఆసుపత్రికి తరలించారు.