రైతులను, మధ్య తరగతి ప్రజలను నిండా ముంచిన బడ్జెట్ !
హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 48 లక్షల 20 కోట్ల రూపాయలలో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించక పోవడం, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు 10 సంవత్సరాల నుండి తగ్గించక పోవడం పేద, మధ్య తరగతి ప్రజలను వంచించడమే అని బీఎస్పీ పార్టీ పక్షాన అడగటం జరుగుతుందన్నారు. జాతీయ క్రైమ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం దేశంలో గత పది సంవత్సరాల లో దాదాపు లక్ష మంది రైతులు, మరియు కౌలు రైతులు చనిపోయారని, రైతులు కనీస మద్దతు ధరల చట్టం కొరకు ఢిల్లీలొ 700 మంది రైతులు ప్రాణ త్యాగం చేసి రెండు సంవత్సరాలు దీక్ష చేశారని, రైతుల ప్రధాన డిమాండ్లు అయిన కనీస మద్దతు ధర చట్టం చేయాలని, స్వామినాథన్ కమిషన్ నివేదిక ఆధారంగా 18 రకాల పంటలకు లక్ష కోట్ల సంఘటిత నిధులు కేటాయించి చట్టం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న 300 రైతు సంఘాలు రైతు డిక్లరేషన్ ఇచ్చారని, ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ రంగాన్ని చేర్చాలని కూడా రైతులు డిమాండ్ చేశారని, కానీ పార్లమెంట్లో ఎటువంటి చర్చ చేయకుండా కేవలం ప్రజలపై పన్నులు మోపేందుకే పార్లమెంటు సమావేశాలు ఏర్పరిచారా అని BSP పార్టీ పక్షాన అడిగారు. దేశంలో మోదీ ప్రభుత్వానికి ఏపీ, బీహార్ తప్ప వేరే రాష్ట్రాలు ఎందుకు కనపడట్లేదో చెప్పాలన్నారు. రాష్ట్రాలకు సమన్యాయంతో బడ్జెట్ కేటాయించినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పి పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల శంకర్, జిల్లా సీనియర్ నాయకులు సుధాకర్, జిల్లా మాజీ అధ్యక్షులు డేగల వెంకటేష్, పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వెలుపుల రాజు, హుస్నాబాద్ మండల అధ్యక్షులు దుండ్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.