మూసి పునరుజ్జీవనానికి బిఆర్ఎస్ సహకరించాలి
నిర్వాసితులకు ఏ కష్టం రానివ్వం
చిన్న కాలువలు సందర్శించారనడం సరికాదు
రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

బాధ్యత గల ప్రతిపక్షంగా మూసి పునరుజ్జీవనానికి బిఆర్ఎస్ పార్టీ సహకరించాలని, మూసి నిర్వాసితుల కష్టాలు ప్రభుత్వానికి తెలుసని, నిర్వాసితులకు ఏ కష్టం రానివ్వమని, నిర్వాసితులకు పునరావాసం, విద్యా వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో మూసిని భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని, ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులు దక్షిణ కొరియా పర్యటనలో చిన్న కాలువలు సందర్శించారనడం సరికాదని, గతంలో ఇలాంటి కాలువలు కేటీఆర్ సందర్శింలేదా అని, కేటీఆర్ గతంలో విదేశీ పర్యటనలు ఎందుకు చేశారని, గూగుల్ మ్యాపుల్లోనే కేటీఆర్ అధ్యయనం చేయకుండా ఫారిన్ టూర్ లు ఎందుకు చేశారు అని అన్నారు.