సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోంది.
బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారమా..?
గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదు..
జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి..
సిద్దిపేట టైమ్స్, జనగామ;
సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోందని
జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం జనగామలో కాంగ్రేస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారం అన్న సామేతను నిజం చేస్తున్నారని.. కేవలం సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి తీసుకోవడం పొరపాటే అని ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అనడం ఇదో కొత్త నాటకం అన్నారు. ప్రజలకు మేలు జరిగే విధంగా ఎమ్మెల్యేలను మా పార్టీలోకి తీసుకుంటే ఏమవుతుంది అని గతంలో కేసీఆర్ వెటకారంగా మాట్లాడారని.. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోవడాన్ని కేసీఆర్ సమర్థించుకున్నారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలను తప్పు పడుతున్నారని ఇది వాళ్ల పనితీరుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ నియంత పోకడలకు నిరసనగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని స్పష్టం చేశారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు.. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అనే దానిపైనే శ్రద్ధ పెట్టారు తప్ప అభివృద్ది పై చిత్త శుద్ది లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే నన్నారు. కేటీఆర్, హరీష్‌రావు తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీకి వెళ్లలేదపమని, కేవలం కవిత బెయిల్ కోసం పైరవీలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఇక జీరోనని.. నోరు మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొఅని.. భవిష్యత్తులో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామన్నారు. ఆగస్టు 15 వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేయబోతున్నామన్నారు.