కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదు..

కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదు..

కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదు..

అధికారం కోల్పోగానే ఏమి మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ పార్టీపై నిందలు

అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంక చందు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు మాట్లాడుతూ…. హుస్నాబాద్ శాసనసభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్దే ధ్యేయంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవాకులు చెవాకులు పేలడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇస్తానన్న ఉచిత ఎరువులు ఇస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బా ఇల్లు ఇచ్చింది మా ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తుంది అని ప్రగల్బాలు పలికిన మాటలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. అధికారం కోల్పోగానే ఏమి మాట్లాడాలో తెలియక కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా ప్రారంభించలేదని రుణమాఫీ కాలేదని ప్రజలను మోసం చేయడం కోసం అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ఆ పైన రుణమాఫీ చేయడం కోసం కసరత్తు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇదే బి ఆర్ ఎస్ హయాంలో కేవలం రూ. 25 వేలకే మాఫీ చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం మీది కాదా అని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండా చేసిన అసమర్థ పాలన మీది కాదా అని అన్నారు. హనుమకొండ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇంటికి వెళ్లిన కేసీఆర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు ను సందర్శించడానికి ఎందుకు రాలేకపోయారని అన్నారు. హుస్నాబాద్  వెనుకబడ్డ ప్రాంతం కాదని గత 10 ఏళ్లలో అభివృద్ధికి నోచుకోలేదని బి ఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా వెనుకకు నెట్టివేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ 10 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిత్తారి పద్మ , వల్లపు రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *