సిద్దిపేట స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి..
ది సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
సిద్దిపేట పట్టణంలోని స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోయి బాలుడు మృతి చెందాడు .
సిద్దిపేట పట్టణం లింగారెడ్డి పల్లి కు చెందిన జాన్ బాబు సంగీతల పెద్ద కుమారుడు టేకుపల్లి గిరీష్ 17 బాసరలోని త్రిబుల్ ఐటీ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాగా సెలవుల్లో భాగంగా ఇంటికి వచ్చిన అతను తనకు బావ అయ్యే సాయికిరణ్ తో కలిసి సిద్దిపేట పట్టణంలోని మున్సిపాలిటీ స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్ళాడు. ఈ క్రమంలో లోతుగా ఉన్న పూల్ లో దూకడంతో ఇతనికి ఈత రాకపోవడం వల్ల ఊపిరాడక మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ పోస్టుమార్టం కు తరలించారు.