సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న…మంత్రి పొన్నం ప్రభాకర్
జయంతి సందర్భంగా ఘన నివాళులు
సిద్దిపేట టైమ్స్ .హుస్నాబాద్ :
సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ఇందుర్తి మాజీ శాసన సభ్యులు బొమ్మ వెంకన్న జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని నాగారం చౌరస్తాలో గల విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే బొమ్మ వెంకన్న బలహీన వర్గాల కోసం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నాకు మార్గదర్శకం అయిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అపారమైనదని తెలిపారు. వై ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవెల్లి ప్రాజెక్ట్ సాధన కోసం శ్రమించిన నాయకుల్లో బొమ్మ వెంకన్న ఒకరని పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో తాను రాజకీయంగా ఎదగడానికి ఆయన ఇచ్చిన మార్గనిర్దేశనం ఎంతో సహాయపడిందని తెలిపారు. బొమ్మ వెంకన్న ఆశయాలను కొనసాగించడం నా బాధ్యత అని చెప్పారు. ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధి, పురోగతికి ప్రభుత్వం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Posted inబ్రేకింగ్ న్యూస్ హుస్నాబాద్
సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి బొమ్మ వెంకన్న…మంత్రి పొన్నం




