గాగిళ్ళపూర్ గ్రామ చెరువులో మృతదేహం లభ్యం
మరో నిండు ప్రాణం బలి…పోలీసుల నిర్లక్ష్యమే కారణమా…!
వరుస సంఘటనలతో ఉలిక్కిపడ్డ మద్దూరు మండలం
ములుగు మండలం పోలీస్ స్టేషన్ ముందు మృతుని బంధువులు,గ్రామస్తులు ఆందోళన
సిద్దిపేట టైమ్స్, మద్దూరు, జులై 30:
మద్దూరు మండల వ్యాప్తంగా శాంతిభద్రతలు గాడి తప్పయని అంటే వరుసగా జరుగుతున్న హత్యలతో అవుననే సమాధానం వినిపిస్తుంది. వరుస సంఘటనలతో రోజురోజుకు నేరాలు పెరుగుతుంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోతున్నాయి.మొన్న కాళ్లు కాడికి కన్యానందం చేసిన అత్తను అల్లుడు అతికిరాతకంగా నరికి చంపి హత్య చేసిన సంఘటన మరువకముందే మండలంలోని గాగిళ్ళపూర్ గ్రామ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన మరో సంఘటన చోటుచేసుకుంది.ఈ సంఘటనలతో ఉమ్మడి మద్దూరు మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.గాగిళ్ళపూర్,ములుగు మండల కేంద్రాలకు చెందిన రెండు గ్రామాల స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం కేంద్రానికి చెందిన తిగుల్ల నెహ్రూ అదే మండల కేంద్రంలోని ఐకెపి(ఇందిరా క్రాంతి పథకం) కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే నెహ్రూ సోమవారం డ్యూటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో మంగళవారం నెహ్రూ సోదరుడు ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.దీనిపై పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో తిగుళ్ల నెహ్రూ గాగిళ్ళపూర్ గ్రామం పెద్ద చెరువుతో శవమై బుధవారం తేలాడు.స్థానికుల అంచనా ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చంపి వేసిన తరువాత, మృతుడి కాళ్లు చేతులు తాడుతో కట్టేసి బయటపడకుండా ఉండడానికి బరువైన బండ రాల్లను కట్టి చెరువులో పడివేసినట్లు తెలుసుంది.పోలీసుల రోజువారి పెట్రోలింగ్ నిర్లక్ష్యం మరియు నిఘా వైఫల్యాల వల్ల నిండు ప్రాణం బలైనట్లు కళ్ళకు కనబడుతుంది. ఇది ఇలా ఉండగా ములుగు పోలీస్ స్టేషన్ ముందు మృతుని కుటుంబ సభ్యులతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ములుగు,మద్దూరు పోలీసుల నిర్లక్ష్యాలతో రెండు వేరు వేరు ఘటనల్లో రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి.మరో సంఘటన చోటు కోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.దీంతో విషయం తెలుసుకున్న మద్దూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తున్నారు.