జలమయమైన ఇండ్లు, షాపులను సందర్శించిన బిజెపి నాయకులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో బిజెపి హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసు ఆధ్వర్యంలో నాలుగు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హుస్నాబాద్ పట్టణంలోని జలమయమైన పలు కాలనీలు, పంట పొలాలను, ఇండ్లను, షాపులను సందర్శించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలో పలు కూడళ్లు, షాపులు, కాలనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి నెలకొందని ప్రధాన కూడళ్లలో ఎన్నడూ లేని విధంగా మోకాళ్ళ లోతు నీళ్లు నిలువ ఉండడం దురదృష్టకరమని నష్టపోయిన రైతులను, ఇల్లు కూలిపోయిన నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకొని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వినర్ జనగామ వేణుగోపాల్ రావు, హుస్నాబాద్ మండల అధ్యక్షులు వెలదండి రాజేంద్రప్రసాద్, హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు తగరం లక్ష్మణ్, రాయికుంట చందు,పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య, సీనియర్ నాయకులు చిట్టి గోపాల్ రెడ్డి, గుత్తికొండ విద్యాసాగర్, వెల్దండి సంతోష్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెందోట భూశంకర్ తదితరులు పాల్గొన్నారు.





