బీజేపీ దే ఆధిపత్యం..ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే..

బీజేపీ దే ఆధిపత్యం..ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే..

బీజేపీ దే ఆధిపత్యం..
ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపే..
బీఆర్ఎస్ కు ఆశలు గల్లాంతెనా..
మధ్యరకంలో కాంగ్రెస్..
అన్నీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కే ఎక్కువ స్థానాలు..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట బ్యూరో..
తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వే లు అంచనా వేస్తున్నాయి.తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగ్గా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్ జరగ్గా నేడు సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి. తెలంగాణలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఓటర్లు ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వనున్నారన్నది సంస్థలు వెల్లడించాయి..

   తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ మే 13న ముగిసింది.ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఓటర్లు ఎలాంటి తీర్పునిచ్చారన్న ఉత్కంఠ 19 రోజులుగా కొనసాగుతోంది. అయితే ఏడు విడతల్లో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ముగిసేవరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించొద్దన్న ఎన్నికల సంఘం నిబంధనతో నేటి వరకు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. నేడు చివరి విడత పోలింగ్ ముగియటంతో ఆయా సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల చేశాయి. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు రానున్నాయన్నది.. ఆయా సంస్థలు సర్వే ఫలితాలు వెల్లదించింది. ఫలితాలకు మరో 3 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆయా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి…

పొలిటికల్ ల్యాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 06
బీజేపీ 09
బీఆర్ఎస్ 01
ఎంఐఎం 01

★ ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 6-8
బీజేపీ 8-10
బీఆర్ఎస్ 0-1
ఎంఐఎం 01

★ జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 4-7
బీజేపీ 9-12
బీఆర్ఎస్ 0-1
ఎంఐఎం 01

★ ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 7-8
బీజేపీ 8-9
బీఆర్ఎస్ 0
ఎంఐఎం 01
★ టీవీ-9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 08
బీజేపీ 07
బీఆర్ఎస్ 01
ఎంఐఎం 01

★ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 7-9
బీజేపీ 6-8
బీఆర్ఎస్ 0-1
ఎంఐఎం 01

★ చాణక్య-ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
పార్టీ సీట్లు
కాంగ్రెస్ 9-11
బీజేపీ 4-6
బీఆర్ఎస్ 0-1
ఎంఐఎం 01

2019లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు..
పార్టీ సీట్లు
బీఆర్ఎస్ 09
కాంగ్రెస్ 03
బీజేపీ 04
ఎంఐఎం 01
మొత్తం 17

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *