బీజేపీ హుస్నాబాద్ పట్టణ నూతన కమిటీ నియామకం..!
నూతన నాయకత్వ బృందానికి అభినందనలు తెలిపిన బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రమణచందర్ రావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, జిల్లా ఇంచార్జి అయ్యన్నగారి భూమయ్య ఆదేశాల మేరకు హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఈ నూతన కమిటీని ప్రకటించారు.
నూతన కమిటీ వివరాలు:
ఉపాధ్యక్షులు: వెల్పుల నాగార్జున్, బొడిగే వెంకటేష్, కాదాసు దీపికా,
ప్రధాన కార్యదర్శులు: గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ
కార్యదర్శులు: వడ్డెపల్లి లక్ష్మయ్య, అకోజు అరుణ్ కుమార్, బొప్పిశెట్టి సాయిరామ్
కోశాధికారి: బుర్ర రాజు
కార్యవర్గ సభ్యులు:
నంగునూరి బాలయ్య, ఒగ్గోజు రాంనారాయణ, ఎగ్గోజు విజయ్ కుమార్, మొగిలి రమేష్, దాసారి బాలకృష్ణ, గార్లపాటి ప్రమోద్, పింగిలి రాంరెడ్డి, కోట రవీందర్, ఎర్రవెల్లి సాగర్, చీకట్ల మహేష్, మంద సది, బీసా శ్రీకాంత్, బోయిని లక్ష్మణ్, ఓం ప్రకాష్ చారీ, కోండపర్తి ప్రసాద్, గోనేల మహేష్, సావుల అక్షయ్, పాలడుగుల రమేష్, ఆకుల శ్రీనివాస్, పెంబర్తి చిరంజీవి, ఖాతా మహేష్, పెందోట సంతోష్, బోజ్జ శ్రీకాంత్, వెల్దండి చందన, ముద్రకోళ సరిత, బింగి సతీష్, దాసరి లక్ష్మీ నారాయణ, కర్నాల వెంకన్న, చిలుపూరి రాజేష్, బొద్ధుల శంకర్, బత్తుల ప్రశాంత్, కోంగ శ్రీధర్
ఈ కమిటీలో మొత్తం 9 మంది పదవులు దక్కించుకోగా, 31 మంది కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, “భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఈ కమిటీకి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను మునిసిపల్ కార్యాలయంపై ఎగరవేసేలా పని చేయాలి,” అని పిలుపునిచ్చారు. నూతన కమిటీ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు.
ఈ ప్రకటనతో హుస్నాబాద్ బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ బలోపేతానికి ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.