కొత్తూరులో టిఆర్ఎస్ కు భారీ షాక్.. మాజీ సర్పంచ్ బాలేష్, అశోక్ లతో సహా సుమారు వందమంది కాంగ్రెస్ లో  చేరిక..

కొత్తూరులో టిఆర్ఎస్ కు భారీ షాక్.. మాజీ సర్పంచ్ బాలేష్, అశోక్ లతో సహా సుమారు వందమంది కాంగ్రెస్ లో  చేరిక..

కొత్తూరులో టిఆర్ఎస్ కు భారీ షాక్..
మాజీ సర్పంచ్ బాలేష్, అశోక్ లతో సహా సుమారు వందమంది కాంగ్రెస్ లో  చేరిక..
సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం..
పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం అంటున్న నర్సారెడ్డి..

సిద్దిపేట టైమ్స్, ములుగు

        స్థానిక సంస్థలు గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. త్వరలో గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండగా అందుకు ముందే గ్రామాలలో పూర్వపు పట్టు పొందాలని చర్యలు చేపట్టింది. స్థానిక గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ జి ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో యువకులు, రైతులు, మహిళలతో  కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చెబుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు గ్రామాల యువకులు, వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద సంఖ్యలో శనివారం సీఎం సలహాదారు వేమ నరేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కొత్తూరు మాజీ సర్పంచ్ బాలేష్, ముఖ్య నాయకులు అశోక్ తో పాటు సుమారు వందమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరినట్లు వారు తెలిపారు. తూంకుంట నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు, పేద  ప్రజల కోసం చేస్తున్న కృషి గ్రామీణ ప్రాంత ప్రజలను బాగా ఆకట్టుకుంటుందని పలువురు పేర్కొన్నారు. గ్రామాలలో స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తే పార్టీ పథకాలు మరిన్ని ప్రజలకు అందివచ్చే అవకాశాలు ఉన్నాయని ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా అనుకూల పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో మంచి నాయకులను పోటీలో ఉంచి ఎక్కువ పదవులను సొంతం చేసుకుని ప్రజలకు  అభివృద్ధిని అందిస్తామని పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు ఎలక్షన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిజమైన ప్రజాపాలను ప్రజలు కోరుకున్న విధంగా అందిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల నాయకులు దేవేందర్ రెడ్డి తో పాటు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *