ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
సిద్దిపేట్ టైమ్స్ కోహెడ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో పండుగ పూట పెను ప్రమాదం తప్పింది. ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకి దూసుకెళ్లి పక్కకి ఒరిగిపోయింది. వెంటనే అప్రమత్తమై డ్రైవర్ బ్రేక్ వెయ్యడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 70 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగారు. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతోనే ప్రమాదం నుండి బయటపడ్డామని ప్రయాణికులు తెలిపారు. సిద్దిపేట – ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు పనులు జరుగుతుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కనీసం రోడ్డుకిరువైపులా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండానే పనులు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.

