కోహెడలో “బెల్ట్‌ ఫుల్‌”.. అక్రమ బెల్టు వ్యాపారాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

కోహెడలో “బెల్ట్‌ ఫుల్‌”.. అక్రమ బెల్టు వ్యాపారాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

కోహెడలో “బెల్ట్‌ ఫుల్‌”

-చాకచక్యంగా వ్యవహరించి అక్రమ బెల్టు వ్యాపారాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్…

-బీర్లు విస్కీ బాటిల్ లిక్కర్ 149.760 లీటర్ల మధ్యన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించిన కోహెడ ఎస్సైతిరుపతి.

సిద్ధిపేట టైమ్స్ డెస్క్:

సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద సముద్రాల గ్రామంలో వేముల చంద్రమౌళి, వేముల మల్లేశం, బుక్క చంద్రం, మౌతమ్ నాగరాజు, పోలోజు సంపత్,పై ఐదుగురు వారి యొక్క కిరాణా షాపులో అక్రమంగా బెల్ట్ షాప్ నడుపుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి కోహెడ పోలీసులు వెళ్లి ఐదు షాపులపై రైడ్ చేసి బీర్లు విస్కీ బాటిల్ లు, లిక్కర్ బాటిల్  అందాజ మొత్తం 149.760 లీటర్ల మధ్యన్ని స్వాధీనం చేసుకుని పై ఐదుగురిపై కేసులు నమోదు చేసి పరిశోధన ప్రారంభించిన కోహెడ ఎస్ఐ తిరుపతి.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ…పోలీస్ కమిషనర్ బి అనురాధ, ఆదేశానుసారం జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక,  పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, బెల్ట్ షాపులు నడిపిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు జరుగుతుందని తెలిపారు.

గ్రామాలలో, పట్టణాలలో ఇసుక, అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన బెల్ట్ షాపులు నడిపిన, గ్యాంబ్లింగ్, పేకాట, ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు కలిగి ఉన్నా రవాణా చేసిన మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *