కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడిగా బెజుగం బాలకృష్ణయ్య
22 సంవత్సరాల నుండి ఏకగ్రీవంగా 11 వ సారీ ఎన్నిక
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్;
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన బెజుగం బాలకృష్ణయ్య 11వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా వ్యాపార రంగంలో అపార అనుభవం ఉన్న బాలకృష్ణ ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మొదటిసారి 2003 లో కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బాలకృష్ణయ్య గత 22 సంవత్సరాల నుండి 11 సారి ఎన్నికయ్యారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం 11వసారి కిరాణం ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బెజుగం బాలకృష్ణయ్య మాట్లాడుతూ.. కిరాణా వర్తక సంఘం అభివృద్ధికి దోహదపడతానని తనకు అవకాశం ఇచ్చి మళ్లీ అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. గత 22 సంవత్సరముల నుండి 11 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు హర్షం వ్యక్తం చేసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు బంధు మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో తనపై బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

