హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 

హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 

హుస్నాబాద్‌లో బీసీల ధర్మ పోరాట దీక్ష విజయవంతం 

బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణకు డిమాండ్

సిద్ధిపేట టైమ్స్ హుస్నాబాద్:

బీసీ జేఏసీ పిలుపు మేరకు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన బీసీ ధర్మ పోరాట దీక్ష ఉత్సాహంగా సాగింది. బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసి, ఆ నిబంధనలను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

దీక్షలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ—
రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించిందని, ఇకపై బీసీ రిజర్వేషన్ల భవితవ్యం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని అన్నారు. బీసీలకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తుందా? లేక బీసీ సమాజానికి ద్రోహిగా వ్యవహరిస్తుందా? అన్నది ఇప్పుడు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీలోకి తీసుకెళ్లడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. బీసీ బిల్లును ఆమోదించి రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వక్తలు స్పష్టం చేశారు. బీసీ జేఏసీ పిలుపునిచ్చిన ఆష్టాంగ ఆందోళనకు బీసీ సమాజంతోపాటు ఇతర సహచర కులాలు కూడా మద్దతు తెలుపుతూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ దీక్షకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ, బీఎస్పీ పార్టీల నేతలు, జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గం, మాలమహానాడు, జనజాగృతి కళాసమితి, బీసీ కుల సంఘాలు విశేష మద్దతు ఇచ్చాయి. ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అధ్యక్షత వహించారు.

దీక్షలో పాల్గొన్న ప్రముఖులు:
సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చిత్తారి రవీందర్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు అన్వర్, బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేష్, ఓయూ జేఏసీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గంపల శ్రీనివాస్, జేఏసీ నాయకులు ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, మెతుకు కొమురయ్య, మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ, నాయిని రజిత, కోడూరి శ్రీదేవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెరుమాండ్ల నర్సాగౌడ్, గట్టు రాములు, కోడం ప్రభాకర్, బీసీ ఐక్య వేదిక నాయకులు మార్క అనిల్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లుపెరుక భాగ్య రెడ్డి, వల్లపు రాజు, పున్న సది, భూక్య సరోజన, బూర వెంకన్న, ముక్కెర సంపత్, బొంగోని శ్రీనివాస్ గౌడ్, అలువోజు రవీందర్, వడ్డేపల్లి వెంకట రమణ, కోమటి సత్యనారాయణ, నాయిని రజిత, అనిల్, మాలమహానాడు నాయకులు వెన్న రాజు, కిషోర్, నోముల బాలయ్య, ఎం.హాసన్, పచ్చిమట్ల శ్రీకాంత్, శివ, బొల్లి శ్రీనివాస్, కేశవేణి రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలయ్య, సంపత్, శ్రీనివాస్ యాదవ్, కోహెడ కొమురయ్య, గాజుల భగవాన్, ముడిక సంపత్, మెతుకు లక్ష్మణ్, పొన్నం మల్లయ్య, కాషబోయిన సాంబరాజు, మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *