డిగ్రీ కళాశాల లో బతుకమ్మ సంబరాలు

డిగ్రీ కళాశాల లో బతుకమ్మ సంబరాలు

తెలంగాణలో అతి ముఖ్యమైన పండగలలో బతుకమ్మ చాలా విశిష్టమైన పండుగ ఈ పండుగను పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో విద్యార్థినులు మరియు మహిళా సిబ్బంది ముందస్తుగా కళాశాలలో ఘనంగా బ్రతుకమ్మ సంబరాలను నిర్వహించారు. దేవుని పూజకు పూలను వాడుతాము అలాంటి పూలను దేవతగా పూజించే పండుగనే బతుకమ్మ. ఈ సంబరాలలో భాగంగా యావత్తు తెలంగాణ ప్రకృతిని,  ప్రకృతిలోని పూలను ఒక క్రమ పద్ధతిలో బతుకమ్మ లాగా పేర్చి పూలను పూజించేటటువంటి ఒక ఘనమైన సంస్కృతి తెలంగాణ సాంప్రదాయంగా,  ఆచారంగా ఎంతో కాలం నుండి కొనసాగుతుంది బతుకమ్మ అంటేనే తెలంగాణ,  తెలంగాణ అంటేనే బతకమ్మ, ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో బతుకమ్మను గౌరమ్మ లాగా పూజించేటటువంటి ఈ పండుగలో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల మహిళలు ఎంతో హుషారుగా కొత్తబట్టలు ధరించి ఒక ప్రత్యేకమైనటువంటి ధాన్యాలతో చేసిన వంటలను ముఖ్యంగా “సత్తును ముద్దలను, సత్తుపిండిని”  వాయినంగా ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. కళాశాల నుండి విద్యార్థులు రకరకాల పూలను సేకరించి మహిళ లెక్చరర్ల సహాయంతో బతుకమ్మలను పేర్చి సంబరాలను నిర్వహించినందుకు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మహిళా సిబ్బందికి మరియు విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలియజేశారు, బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియచెప్పడం జరిగింది. అలాగే శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలలకు దసరా సెలవులను ఈనెల 21 నుండి అక్టోబర్ 5 వరకు, అక్టోబర్ ఆరవ తేదీన కళాశాల పునర్ ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ బతుకమ్మ సంబరాలను కళాశాల కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో జి. విజయ, డాక్టర్ ఇందిరా నాయన దేవి, డాక్టర్ అనిత, కే. రాజ్యలక్ష్మి, బి. సుధా మాధురి, డాక్టర్ షబీ ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *