హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “బేసిక్ కంప్యూటర్ స్కిల్స్” సర్టిఫికెట్ కోర్స్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో నూతనంగా “కంప్యూటర్ లో బేసిక్స్ పైన సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రస్తుతం చదువుతున్న వారు, పూర్తి చేసిన వారు, అలాగే హుస్నాబాద్ పట్టణమునకు చెందిన ఆసక్తి గల ఇతర విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపారు. డిగ్రీ కళాశాలో కల ఆధునాతన కంప్యూటర్ ల్యాబ్ లో శిక్షణనిస్తామని తెలిపారు. ఈ కోర్సు లో చేరడానికి కేవలం 300 రూపాయలు ఫీజు చెల్లించి, రెండు నెలలు పాటు శిక్షణ పొందవచ్చని తెలిపారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ మరియు కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తామని తెలియజేశారు. ఆసక్తి కలవారు ఆఖరుతేది సెప్టెంబర్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. వివరాలకు కోర్సు కన్వీనర్ డాక్టర్ వడ్నాల చంద్రమౌళి 8897402310 ఫోన్ చేసి కానీ, కాలేజీకి వచ్చి స్వయంగా కానీ సంప్రదించాలని సూచించారు.





