నేడు హుస్నాబాద్‌లో బండి సంజయ్ పర్యటన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్) ద్వారా రూ.1 కోటి 50 లక్షల నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆసుపత్రికి ఈసీజీ, అల్ట్రాసౌండ్, మల్టిపారా మానిటర్, ఆటో క్లీవ్, డయా థెర్మీ, డబుల్ డోమ్ లైట్, అనేస్తేసియా వర్క్ స్టేషన్, ఫెటల్ మనిటర్, జనరల్ సర్జరీ టేబుల్, ఎమర్జెన్సీ రికవరీ ట్రాలీ, ENT హెడ్ లైట్, సిరంజ్ పంపు యూనిట్ సహా 15 అత్యాధునిక పరికరాలు చేరాయి. ఆరోగ్య సేవలు మెరుగై ప్రజలకు మరింత లాభం చేకూరుతుందని అసెంబ్లీ కన్వీనర్ గురాల లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ తెలిపారు.





